logo

ఎమ్మెల్సీ ఓటర్లలో పురుషులదే పైచేయి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) ఓటర్లలో పురుష ఓటర్లదే పైచేయిగా ఉంది. మొత్తం ఓటర్లలో 63.01 శాతం పురుషులు, 36.97 శాతం మహిళలు, ఇతరులు 0.02 శాతం ఉన్నారు.

Published : 23 Jan 2023 03:24 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) ఓటర్లలో పురుష ఓటర్లదే పైచేయిగా ఉంది. మొత్తం ఓటర్లలో 63.01 శాతం పురుషులు, 36.97 శాతం మహిళలు, ఇతరులు 0.02 శాతం ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి తుది ఓటరు జాబితాను వెలువరించింది. ఉత్తరాంధ్ర పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతీపురం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 2,83,749 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,78,796, మహిళలు 1,04,913, ఇతరులు 40 మంది ఉన్నారు.

త్వరలో నోటిఫికేషన్‌

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పండగ తర్వాత ఏక్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది, 2017లో ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నిక జరిగింది. ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ పదవీ కాలం మార్చి 17వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తుది ఓటరు జాబితాలు ప్రకటించినప్పటికీ అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. నామపత్రాల స్వీకరణకు ఏడు రోజుల ముందు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని