logo

కోల్‌కతాలో నేవీ పరాక్రమ దివస్‌

ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌కు చెందిన కోల్‌కత్తాలోని ఐఎన్‌ఎస్‌ నేతాజీ యూనిట్‌లో భారత నౌకాదళం సోమవారం నేతాజీ సుభాస్‌చంద్రబోస్‌ జయంతి సందర్భంగా పరాక్రమ దివస్‌ను ఘనంగా నిర్వహించింది.

Published : 24 Jan 2023 03:26 IST

నేతాజీ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్నఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా, తదితరులు

సింధియా, న్యూస్‌టుడే: ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌కు చెందిన కోల్‌కత్తాలోని ఐఎన్‌ఎస్‌ నేతాజీ యూనిట్‌లో భారత నౌకాదళం సోమవారం నేతాజీ సుభాస్‌చంద్రబోస్‌ జయంతి సందర్భంగా పరాక్రమ దివస్‌ను ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమాండ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా పాల్గొని మాట్లాడారు. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పక్కనే ఉన్న హుగ్లీ నది సమీపాన నిర్మించిన భారత నేవల్‌ వెట్‌ బేసిన్‌్ ‘దామోదర్‌ కాంప్లెక్సు’ను ప్రారంభించారు. కోల్‌కత్తా కేంద్రం ద్వారా భారత నౌకాదళం గస్తీ బోట్ల నిర్వహణ సదుపాయం అందుబాటులోకి రానుందన్నారు. అనంతరం నేతాజీ యూనిట్‌లో ఆపరేషన్‌ విధులు, కొనసాగుతున్న నేవల్‌ ప్రాజెక్టుల పనితీరును సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని