logo

ప్రశాంతంగా జేఈఈ మెయిన్‌ పరీక్ష

చినముషిడివాడ డబ్ల్యూటీటీ కాలనీలోని జియాన్‌ డిజిటల్‌ పరీక్ష కేంద్రంలో మంగళవారం జేఈఈ మెయిన్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

Published : 25 Jan 2023 04:56 IST

జియాన్‌ పరీక్ష కేంద్రం వద్ద రోడ్డుపై జనం

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: చినముషిడివాడ డబ్ల్యూటీటీ కాలనీలోని జియాన్‌ డిజిటల్‌ పరీక్ష కేంద్రంలో మంగళవారం జేఈఈ మెయిన్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ పోటీ పరీక్షలు జరిగిన ప్రతిసారీ ఆయా కేంద్రాల సమీపంలోని నివాసితులు, ప్రధాన రహదారిలో రాకపోకలు చోదకులు తీవ్రôగా ఇబ్బంది పడుతున్నారు. నిర్వాహకులు కనీసం పట్టించుకోకపోవడంతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. మంగళవారం వందలాది మంది పరీక్షార్థులతో పాటు వారి బంధువులు పరీక్ష కేంద్రానికి తరలివచ్చారు. బీఆర్టీఎస్‌ ప్రధాన రహదారికి సమీపంలోనే ఈ పరీక్ష కేంద్రం ఉంది. పరీక్షకు వచ్చిన వారు తమ కార్లు, ద్విచక్ర వాహనాలను రహదారిపైనే పార్కింగ్‌ చేయడంతో పలుమార్లు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ స్తంభించింది. పరీక్ష కేంద్రం ఎదుట భారీగా జనం గుమిగూడారు. దీంతో పలుమార్లు వాహన చోదకులు డయల్‌-100కు కాల్‌ చేశారు. పెందుర్తి ట్రాఫిక్‌ ఎస్‌ఐ జి.రమేశ్‌ ఆధ్వర్యంలో పది మంది సిబ్బంది వాహనాలను క్రమబద్ధీకరించేందుకు గంటపాటు శ్రమించాల్సి వచ్చింది. పరీక్షల నిర్వహణపై తమకు ముందుస్తు సమాచారం లేకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయని ఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని