logo

వచ్చేనెల నుంచే గోధుమ పిండి

జిల్లాలోని ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల పరిధిలోని రేషన్‌ కార్డుదారులకు ఫిబ్రవరి నెలలో రెండేసి కేజీల చొప్పున గోధుమ పిండి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 25 Jan 2023 04:56 IST

పైలట్‌ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక

పౌరసరఫరాలశాఖ సరఫరా చేయనున్న గోధుమ పిండి ప్యాకెట్లు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: జిల్లాలోని ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల పరిధిలోని రేషన్‌ కార్డుదారులకు ఫిబ్రవరి నెలలో రెండేసి కేజీల చొప్పున గోధుమ పిండి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక సంఘాల పరిధిలోని రేషన్‌ డిపోలకు గోధుమ పిండి సరఫరా చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పంపిణీని రెండు మున్సిపాలిటీలతో పాటు జీవీఎంసీ పరిధిలోకి వచ్చే అనకాపల్లి పట్టణంలోనూ అమలు చేస్తున్నారు. కేజీ రూ. 17కి విక్రయించాలని నిర్ణయించింది. బయట మార్కెట్‌లో రూ. 50 పైనే ఉంది. దీంతో కార్డుదారులకు కేజీ దగ్గర రూ. 33 వరకు ఆదా అవుతుంది. అనకాపల్లి పట్టణంలోని 40, ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 18, నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 21 రేషన్‌ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలోని కార్డుదారులందరికీ రెండు కేజీల చొప్పున గోధుమ పిండి సరఫరా చేస్తారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన కొన్ని జిల్లాలో అనకాపల్లి జిల్లాకు ఈ అవకాశం దక్కింది. ఫిబ్రవరి కోటాతో వీటిని అందిస్తామని పౌర సరఫరాల శాఖ డీఎం శ్రీలత చెప్పారు. గోదాములకు ఈ సరకు చేరుకుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం రేషన్‌ డిపోల్లో బియ్యం, పంచదార, కందిపప్పు మినహా మరే ఇతర సరకులు ఇవ్వడంలేదు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని