logo

విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా... ఆనంద్‌

విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇన్నాళ్లు ఛైర్మన్‌గా పని చేసిన ఆడారి తులసీరావు ఇటీవల కన్నుమూసిన తర్వాత.. నూతన ఛైర్మన్‌ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.

Published : 27 Jan 2023 03:11 IST

ఆనంద్‌ను సత్కరిస్తున్న డైరెక్టర్లు, ఉద్యోగులు

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇన్నాళ్లు ఛైర్మన్‌గా పని చేసిన ఆడారి తులసీరావు ఇటీవల కన్నుమూసిన తర్వాత.. నూతన ఛైర్మన్‌ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చర్చించిన డైరెక్టర్లు గురువారం డెయిరీ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. సీనియర్‌ డైరెక్టర్‌ రెడ్డి రామకృష్ణ ముందుగా ఆడారి ఆనంద్‌కుమార్‌ పేరు ప్రతిపాదించగా మిగిలిన డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.  అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. తనకు బాధ్యతలు అప్పగించిన పాలకవర్గం సభ్యులు, డెయిరీ అధికారులు, ఉద్యోగులు, పాడి రైతుల నమ్మకాన్ని నిలబెడతానని పేర్కొన్నారు. ఎండీ ఎస్‌వీ రమణ, ఆనంద్‌ సోదరి, డెయిరీ డైరెక్టర్‌, ఎలమంచిలి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రమాకుమారి, ఇతర డైరెక్టర్లు, అధికారులంతా కలిసి ఆనంద్‌ను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆనంద్‌ తండ్రి తులసీరావు మూడు దశాబ్దాలకు పైగా ఛైర్మన్‌గా కొనసాగి.. సంస్థను అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. నిత్యం 8.5 లక్షల లీటర్ల పాలు సేకరిస్తూ, దాదాపు రూ.1500 కోట్ల టర్నోవర్‌ గల సంస్థగా నిలబెట్టారు. తులసీరావుకి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో డైరెక్టర్‌గా ఉన్న ఆనంద్‌ను మూడేళ్ల కిందటే వైస్‌ ఛైర్మన్‌గా నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని