logo

కొనసాగుతున్న కౌన్సెలింగ్‌ ప్రక్రియ

ఉపాధ్యాయుల సర్దుబాటు కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. ముందుగా ఇచ్చిన ప్రక్రియ అంతా అస్తవ్యస్తంగా ఉందని ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో పాత విధానం అంతా రద్దుచేసి తాజాగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు.

Published : 27 Jan 2023 03:11 IST

ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : ఉపాధ్యాయుల సర్దుబాటు కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. ముందుగా ఇచ్చిన ప్రక్రియ అంతా అస్తవ్యస్తంగా ఉందని ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో పాత విధానం అంతా రద్దుచేసి తాజాగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. అంగీకారం తెలిపిన ఉపాధ్యాయులకు వారు నివాసం ఉంటున్న మండలాల్లోనే తొలి ప్రాధాన్యత ఇచ్చి తరువాత పక్క మండలాలకు, ఆ తరువాత పాత జిల్లాల ప్రకారం పోస్టులు ఇవ్వటానికి అధికారులు అంగీకారం తెలిపారు. గురువారం నిర్వహించిన  కౌన్సెలింగ్‌కు జీవశాస్త్రం 71 మందికి, ఇంగ్లీషు 41 మంది, సోషల్‌ 104 మంది హాజరయ్యారని, వీరందరి పోస్టింగ్‌లు ఇచ్చామన్నారు. శుక్రవారం భౌతిక శాస్త్రం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి చంద్రకళ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని