అంచనాలు తారుమారు!
విశాఖ విమానాశ్రయాన్ని మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటవుతుందనే ఉద్దేశంతో పలు సౌకర్యాల కల్పనలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం ఇప్పుడు ప్రభావం చూపుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
విశాఖ విమానాశ్రయంలో మెరుగవని సేవలు
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయాన్ని మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటవుతుందనే ఉద్దేశంతో పలు సౌకర్యాల కల్పనలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం ఇప్పుడు ప్రభావం చూపుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్లు ప్రణాళికలు అమలు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. ః ప్రముఖ పర్యాటక నగరంగా పేరున్న విశాఖకు దేశంలోని పలు ప్రాంతాలతో అనుసంధానం అయ్యేలా ఎన్నో సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. గోవా, కొచ్చి, గువాహటి, శ్రీనగర్ తదితర ప్రాంతాలకు విశాఖ నుంచి నేరుగా విమాన సర్వీసులు నడపాలన్న డిమాండు ఉంది. ముంబయి, విజయవాడకు సర్వీసులు ఉన్నా..అవి మధ్యాహ్నం వేళల్లోనే. ః కౌలాలంపూర్, దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, కొలంబోలకు విమాన సర్వీసులు గతంలో నడిచి ఆగిపోయాయి. ఆ తరువాత సింగపూర్ విమానం ఒక్కటే అందు బాటులోకి వచ్చింది. ః విశాఖ నుంచి కార్గో (ఎగుమతి/ దిగుమతులు) ప్రక్రియ నిర్వహించే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్(ఎ.పి.టి.పి.సి.)కి అప్పగించారు. ఆ సంస్థ ఈ బాధ్యతలను మరో ఏజెన్సీకి అప్పగించింది. మౌలిక వసతులు లేక...స్థానిక పరిశ్రమల అవసరాలను తీర్చలేక.. తగిన నిల్వ సదుపాయాలు లేక.. రవాణాకు అనుకూలమైన పరికరాల కొరత...ప్రత్యేక రవాణా విమానాలు రాక..కొవిడ్ విజృంభణతో అంచనాలు తారుమారయ్యాయి. కార్గో సేవలు పడిపోయాయి. ఇటీవల ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్’ అధికారులు భద్రతాపరమైన కారణాలు చూపి ఆ సేవలూ నిలిపివేశారు. ః ఇక్కడ రాత్రి సమయాల్లో ఆరు విమానాలను నిలిపేలా ఏర్పాట్లు చేశారు. నేటికీ ఒక్క సంస్థ కూడా ఆ కీలక సౌకర్యాన్ని వినియోగిం చుకోవడంలేదు. వ్యయంతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఎవరూ మొగ్గు చూపడం లేదని సమాచారం.
అవసరాలకు తగిన విధంగా..: కౌలాలంపూర్‌కు బాటిక్ ఎయిర్ సంస్థ సర్వీసు పునరుద్ధరణకు నిర్ణయించింది. దుబాయ్ విమానాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. లాభదాయకతను బట్టి సంస్థలు తగిన నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తాం.
కె.శ్రీనివాసరావు, డైరెక్టర్, విశాఖ విమానాశ్రయం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
India News
ChatGPT: భారత్ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!
-
Sports News
Labuschagne:ఐపీఎల్లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!