logo

రాష్ట్రంలో ఉద్యమాల అణచివేతకు కుట్ర

రాష్ట్రంలో ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు స్పష్టంచేశారు.

Published : 28 Jan 2023 05:02 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు

మాట్లాడుతున్న బి.వి.రాఘవులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు స్పష్టంచేశారు. శుక్రవారం విశాఖలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడం నిరంకుశత్వానికి నిదర్శనం. రాష్ట్రంలోనూ జగన్‌ ప్రభుత్వం జీవో1 తెచ్చి, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు స్థానిక సంస్థలనూ నిర్వీర్యం చేస్తోంది. సర్పంచులు తమ హక్కులు, విధులపై ఆందోళన చెందుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమై దాదాపు మూడేళ్లవుతోంది. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా విశాఖలో ఈనెల 30న ప్రజాగర్జన పేరిట భారీ ప్రదర్శన, సభ నిర్వహించబోతున్నాం. ప్రత్యేకహోదా సాధనకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకుడు జగ్గునాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని