logo

మనస్తాపంతో డ్రైవర్‌ ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అర్ధరాత్రి పరవాడ మండలం గొర్లెవానిపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో చోటు చేసుకుంది.

Published : 28 Jan 2023 05:02 IST

మృతి చెందిన శ్రీనివాస్‌

పరవాడ, న్యూస్‌టుడే : భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అర్ధరాత్రి పరవాడ మండలం గొర్లెవానిపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో చోటు చేసుకుంది. శుక్రవారం పరవాడ సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా నివాసం ఉంటున్న వ్యాన్‌ డ్రైవర్‌ ఎస్‌.శ్రీనివాస్‌(35)కి ఏడాదిన్నర కిందట నర్సీపట్నం ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో... భార్య పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో శ్రీనివాస్‌ ఇంట్లోనే ఉరేసుకున్నారు. శుక్రవారం ఉదయం అదే కాలనీలో ఉంటున్న తల్లిదండ్రులు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. మృతుడి తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని