logo

నిధులు లేక... పనులు సాగక!

నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో చేపట్టిన నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏళ్లుగా అడుగు ముందుకు పడటం లేదు.

Published : 29 Jan 2023 05:29 IST

పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పరిస్థితి ఇది

ద్వారకా ఏసీపీ కార్యాలయం, ఆరిలోవ స్టేషన్‌లకు నిర్మిస్తున్న భవనం

ఈనాడు, విశాఖపట్నం: నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో చేపట్టిన నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏళ్లుగా అడుగు ముందుకు పడటం లేదు. హంగులు ఎప్పటికి సమకూరుతాయన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. కమిషనరేట్‌లో వివిధ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించింది. వాస్తవానికి ఆ నిధులు సరిపోవు. అందులోనూ సకాలంలో విడుదల కాక పనుల్లో అనుకున్నంత కదలిక లేదు.

* కమిషనరేట్‌ కార్యాలయం ముందుండే ఉద్యానవనం స్థానంలో నూతన భవన నిర్మాణ పనులు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షణలో ప్రారంభించారు. తరువాత పునాదుల స్థాయిలో ఆగిపోయాయి. దాదాపు 18 నెలలుగా ఎలాంటి పురోగతి లేదు. జాప్యంతో ఇనుప చువ్వలు తుప్పుపట్టే పరిస్థితి నెలకొంది.

*డీసీపీ కార్యాలయ నిర్మాణానికి వాల్తేరుక్లబ్‌ సమీపంలో స్థలం పరిశీలించారు. స్థల విషయంలో తలెత్తిన సమస్యతో ప్రతిపాదనను పక్కన పెట్టేశారు.

* ఎన్‌.ఎ.డి. కొత్తరోడ్డు ప్రాంతంలో సైబర్‌క్రైం పోలీసుస్టేషన్‌ నిర్మాణం కూడా గతంలో ప్రారంభించి వదిలేశారు. ఇటీవలే మళ్లీ ప్రారంభయ్యాయి. బీ రాష్ట్ర విభజన తరువాత తొట్లకొండ వద్ద గ్రేహౌండ్స్‌ విభాగమే ప్రధాన శిక్షణ కేంద్రంగా మారింది. ప్రస్తుత అవసరాలకు అది సరిపోవడంలేదు. దీంతో ఆనందపురం మండలంలోని జగన్నాథపురంలో 385 ఎకరాలను కేటాయించారు. ఈ భూమికి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ఆ ప్రక్రియ పూర్తై, భూముల్లో పనులు ఎప్పుడు ఆరంభిస్తారో చూడాలి.

మహారాణిపేట పోలీసుస్టేషన్‌కు ప్రత్యేక భవనాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించినా పనుల్లో ప్రగతి లేదు. బీ విమ్స్‌ ప్రాంగణంలో ద్వారకా ఏసీపీ, ఆరిలోవ స్టేషన్‌లను నిర్మించడానికి వీలుగా రెండు అంతస్తులు నిర్మించినా పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఆ భవనం అందుబాటులోకి రాలేదు. వారం కిందటే మళ్లీ నిధులు రావడంతో పనులు మొదలుపెట్టారు. మొత్తం రూ.3.50 కోట్ల వ్యయం చేసే ఈ నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని