logo

అధికార భాషా సంఘం ఉన్నట్టా? లేనట్టా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార భాషా సంఘం అమరావతి(విజయవాడ)లో ఉన్న కార్యాలయాన్ని గతేడాది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మార్చుతున్నట్లు అప్పటి సంఘం ఛైర్మన్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

Published : 31 Jan 2023 04:47 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ భవన్‌లో ఏర్పాటు చేసిన అధికార భాషా సంఘం కార్యాలయం బోర్డు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార భాషా సంఘం అమరావతి(విజయవాడ)లో ఉన్న కార్యాలయాన్ని గతేడాది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మార్చుతున్నట్లు అప్పటి సంఘం ఛైర్మన్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఏయూ హిందీ భవన్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజలకు తెలిసేలా అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. హిందీ భవన్‌లో ఉన్న గ్రంథాలయాన్నే కార్యాలయంగా పేర్కొంటూ ఆ గ్రంథాలయం బయట గోడపై కూడా అధికార భాషా సంఘం అని బోర్డు పెట్టారు. అయితే విజయవాడలో ఉన్న ఈ కార్యాలయం అక్కడ, ఇక్కడ కొనసాగిస్తామని అప్పట్లో చెప్పినా ఎవరు అక్కడ నుంచి ఇక్కడకు రాలేదు. ఛైర్మన్‌ హోదాలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాత్రమే హాజరయ్యేవారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సీటీని ప్రభుత్వం డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌. హెల్త్‌ వర్సిటీగా మార్చినందుకు నిరసనగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బంది లేని ఈ కార్యాలయం ఉన్నట్టా? లేనట్టా? అనే సందేహం వ్యక్తమవుతోంది. దీనికి సమాధానం అధికార భాషా సంఘం మాత్రమే చెప్పగలదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని