logo

అక్కడలా... ఇక్కడిలా...

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు. డిగ్రీ కోర్సులో గతంలో మొదటి రెండు సంవత్సరాలు తెలుగు కోర్సు ఉండేది. తర్వాత సెమిస్టర్‌ విధానం వచ్చిన తర్వాత నాలుగు సెమిస్టర్లుగా మార్చారు.

Published : 31 Jan 2023 04:22 IST

తెలుగుభాషపై ఇదేనా ప్రేమ

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు. డిగ్రీ కోర్సులో గతంలో మొదటి రెండు సంవత్సరాలు తెలుగు కోర్సు ఉండేది. తర్వాత సెమిస్టర్‌ విధానం వచ్చిన తర్వాత నాలుగు సెమిస్టర్లుగా మార్చారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగును ఆరు సెమిస్టర్లకు మార్చారు. అంటే డిగ్రీ విద్యార్థులు మూడేళ్లు తెలుగు కోర్సు చదువుకొనే వీలుంటుంది. దీని వల్ల తెలుగు అధ్యాపకులను నియమించుకోవచ్చు. తెలుగు పండితులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో తెలుగును మూడు సెమిస్టర్లకు కుదించారు. అంటే డిగ్రీతో పోల్చితే పూర్తిగా రెండేళ్లు కూడా విద్యార్థులు తెలుగు చదివే అవకాశం లేదు. దీంతో అధ్యాపకుల పోస్టులు కోల్పోవలసి వస్తుందని నిరుద్యోగులు వాపోతున్నారు. తెలంగాణ మాదిరిగా ఆరు సెమిస్టర్‌లు ప్రవేశపెట్టినా సరే. లేదా గతంలో మాదిరి కనీసం నాలుగు సెమిస్టర్‌లైనా (రెండేళ్లు) పెట్టాలని కోరుతున్నారు. అలాగే ఇంటర్మీడియట్‌లో కూడా తెలుగు సబ్జెక్టు తప్పని సరిచేయాలని కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల తెలుగు అధ్యాపకులు పోస్టులు సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. ఈ మేరకు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి, అధికార భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్‌ వి.విజయబాబుతో పాటు ఏయూ వీసీ ఆచార్య  పి.వి.జి.డి.ప్రసాదరెడ్డికి ఇటీవల సెయింట్‌ జోసెఫ్స్‌ మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ కిలారి గౌరినాయుడు నేతృత్వంలో వినతి పత్రం అందించారు. ఈ విషయం ఇంతవరకు తమదృష్టికి రాలేదని, దీన్ని పరిశీలిస్తామని వారు ముగ్గురు తెలియజేసినట్లు డాక్టర్‌ గౌరినాయుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని