logo

నాలుగేళ్లు సాగే... అటు, ఇటు ఆగే!!

పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక ఆటోనగర్‌ సమీప వడ్లపూడి వద్ద ప్రయాణికులకు ఏళ్లుగా పాట్లు తప్పడం లేదు. ఎక్కువగా సరకు రవాణా రైళ్లు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి.

Published : 31 Jan 2023 04:47 IST

వడ్లపూడి రైల్వే పైవంతెన ఇలా అసంపూర్తిగా...

పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక ఆటోనగర్‌ సమీప వడ్లపూడి వద్ద ప్రయాణికులకు ఏళ్లుగా పాట్లు తప్పడం లేదు. ఎక్కువగా సరకు రవాణా రైళ్లు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో నిత్యం అనేక సార్లు రైల్వే గేటు పడుతుంది. దీంతో ఇక్కడ వేచి ఉండక తప్పని పరిస్థితి. ఆ సమయంలో భారీగా వాహనాలు నిలిచిపోతుంటాయి. ఈ సమస్య పరిష్కారానికి 2018లో చేపట్టిన పైవంతెన పనులు పూర్తి కాలేదు. రైల్వే ట్రాక్‌ పైన మాత్రమే వంతెన పూర్తయింది. అటూ, ఇటు దారుల ఏర్పాటు పనులు జీవీఎంసీ, ఏపీఐఐసీ చేపట్టాల్సి ఉంది. పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు ఇక్కడి కష్టాలను  కలెక్టర్‌ మల్లికార్జున దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో త్వరగా పనులు పూర్తి చేయాలని ఇటీవల ఓ సమీక్షలో కలెక్టర్‌ ఆదేశించారు. అవెప్పటికి అవుతాయో వేచి చూడాలి.

ఈనాడు, విశాఖపట్నం

రైలు గేటు వద్ద వాహనదారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని