logo

ఎమ్మెల్యే వస్తారని.. కుళాయిలకు నీళ్లు

ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని తులసీనగర్‌ దిగువ ప్రాంతంలో ఆరు నెలలు కుళాయిల ద్వారా పూర్తిస్థాయిలో నీళ్లు రావడంలేదు.

Published : 01 Feb 2023 05:25 IST


తులసీ నగర్‌లో మంగళవారం రాత్రి కుళాయిల ద్వారా ఇస్తున్న తాగునీరు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని తులసీనగర్‌ దిగువ ప్రాంతంలో ఆరు నెలలు కుళాయిల ద్వారా పూర్తిస్థాయిలో నీళ్లు రావడంలేదు. వారంలో రెండు రోజులు సరఫరా అయినా... రెండు బిందెలు మించి రావడం కష్టం. ఇక్కడి మహిళలు ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదు. సమస్య పరిష్కరించలేదు. అలాంటిది ఎవరూ అడక్కుండానే మంగళవారం రాత్రి తులసీనగర్‌ శివారు ప్రాంతాల్లో కుళాయిల ద్వారా పుష్కలంగా నీరు సరఫరా చేశారు. రాత్రి ఆరున్నర నుంచి ఏడున్నర గంటల వరకూ నీటిని సరఫరా చేశారు. ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయారు. చివరకు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలో జరుగుతోంది. తులసీనగర్‌ ప్రాంతాల్లో రెండు రోజుల్లో పర్యటన ఉంది. ఆయనకు స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా.. ఆయనకు ఎవరూ ఫిర్యాదు చేయకుండా అధికారులు ఇలా రాత్రి పూట కూడా నీళ్లు ఇస్తున్నారు. ఈ విషయం మున్సిపల్‌ ఏఈ జి.సునీల్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా పైపులైన్‌ మరమ్మతులు కారణంగా నీళ్లు ఆపేస్తే తులసీనగర్‌ వాసులు ఇబ్బంది పడతారని రాత్రులు నీరు ఇస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ కాలనీకి రాత్రులు ఇస్తున్నామన్నారు. మంగళవారం నుంచి ప్రారంభించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని