logo

హెచ్‌ఎం సహా ఉపాధ్యాయులకు షోకాజ్‌లు

పనితీరు మెరుగుపడని ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఉప విద్యాశాఖాధికారి ప్రేమ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 01 Feb 2023 05:25 IST

కోటవురట్లలో విద్యార్థినుల రాత పుస్తకాలు

పరిశీలిస్తున్న ఉప విద్యాశాఖ అధికారి ప్రేమ్‌కుమార్‌

కోటవురట్ల, న్యూస్‌టుడే: పనితీరు మెరుగుపడని ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఉప విద్యాశాఖాధికారి ప్రేమ్‌కుమార్‌ పేర్కొన్నారు. కోటవురట్ల జడ్పీ బాలికోన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. తరగతి గదులకు వెళ్లి  రాత పుస్తకాలు పరిశీలించారు. పాఠ్యాంశాలతోపాటు పాఠ్య ప్రణాళిక, డైరీలను తనిఖీ చేశారు. రాత పుస్తకాలు, పరీక్ష పత్రాల్లో తప్పుల దిద్దుబాటు సరిగా లేదని ఉపాధ్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఈటీ మినహా ప్రధానోపాధ్యాయుని యేసుదాసుతోపాటు 12 మంది ఉపాధ్యాయినులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. అనంతరం కె.వెంకటాపురం జడ్పీ పాఠశాలను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. అక్కడా పనితీరు బాగోలేదని 12 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. పాఠశాల ఆవరణలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. జిల్లాలో ఈ ఏడాది 42 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారని, శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. మండల విద్యాశాఖాధికారి అప్పారావు వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని