logo

తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉంటే నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చునని జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌ అన్నారు.

Published : 01 Feb 2023 05:25 IST

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ కె.ఎస్‌.విశ్వనాథన్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉంటే నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చునని జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో జరిగిన జిల్లా స్థాయి వినియోగదారుల హక్కుల రక్షణ మండలి సమావేశంలో జేసీ పాల్గొని మాట్లాడారు. రైతుబజార్లు, కిరణా దుకాణాల్లో తూకాలు సక్రమంగా లేకుంటే కేసులు నమోదు చేయాలన్నారు. కల్తీ నూనెలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార తనిఖీ అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసే సమయంలో వస్తువు నాణ్యత పరిశీలించాలని, ప్రకటనలకు ఆకర్షితులై మోసపోకూడదన్నారు. మోసపోతే వినియోగదారుల రక్షణ చట్టం కింద పరిహారం పొందే అవకాశం ఉందన్నారు. ప్రయివేటు మెడికల్‌ ల్యాబ్స్‌లో సరైన ప్రమాణాలు పాటించడం లేదని, చాలా చోట్ల అనుమతులు లేకుండా నడుస్తున్నాయని పలువురు వినియోగదారుల సంఘం సభ్యులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల వారీ ప్రయివేటు ల్యాబ్స్‌ను తనిఖీ చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్‌ డెలివరీకి డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీఎస్‌ఓ సూర్యప్రకాశరావు, వివిధ శాఖల అధికారులు, వినియోగదారు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని