logo

24న న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు

విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం సంఘం అధ్యక్షుడు వైద్యుల రవీంద్రప్రసాద్‌ విడుదల చేశారు.

Updated : 02 Feb 2023 06:05 IST

జి.ఎం.రెడ్డికి నియామకపత్రం అందిస్తున్న రవీంద్రప్రసాద్‌ తదితరులు

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం సంఘం అధ్యక్షుడు వైద్యుల రవీంద్రప్రసాద్‌ విడుదల చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ కార్యదర్శి, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శి, మహిళా ప్రతినిధి స్థానాలతోపాటు ముగ్గురు సీనియర్‌, ఆరుగురు జూనియర్‌ కార్యనిర్వాహక సభ్యుల స్థానాలకు ఈనెల 24న పోటీ జరగనున్నది. బార్‌ కౌన్సిల్‌ ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి నెల 16న నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన, 22న ఉపసంహరణ, 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు ఎన్నికలు నిర్వహించి, ఫలితాలను అదే రోజు రాత్రి ప్రకటించడానికి ఏర్పాట్లు చేసినట్లు సంఘం అధ్యక్షుడు రవీంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. నగరానికి చెందిన సీనియర్‌ న్యాయవాది జి.ఎం.రెడ్డి ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.  

అధ్యక్ష స్థానానికి హోరాహోరీ పోటీ: న్యాయవాదుల సంఘం అధ్యక్ష స్థానానికి చింతపల్లి రాంబాబు, ఐఎం అహ్మద్‌, పాకా సత్యనారాయణ, తాళ్ళూరి రవికుమార్‌ పోటీ పడుతున్నారు. నలుగురూ సీనియర్‌ న్యాయవాదులు కావడంతో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని