logo

భారీగా నిషేధిత మత్తు ఇంజక్షన్లు స్వాధీనం

నిషేధిత మత్తు ఇంజక్షన్లను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు.  నగరంలో మత్తు ఇంజక్షన్ల విక్రయాలపై నగర సీపీ శ్రీకాంత్‌, విశాఖ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జేడీ బి.శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచారు.

Published : 02 Feb 2023 05:22 IST

వివరాలు వెల్లడిస్తున్న సెబ్‌ అధికారులు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : నిషేధిత మత్తు ఇంజక్షన్లను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు.  నగరంలో మత్తు ఇంజక్షన్ల విక్రయాలపై నగర సీపీ శ్రీకాంత్‌, విశాఖ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జేడీ బి.శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచారు. మహారాణిపేట సెబ్‌ స్టేషన్‌ పరిధిలో మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అల్లిపురం మార్కెట్‌ ప్రాంతంలో నిఘాను పెంచారు. అల్లిపురానికి చెందిన బి.శ్రీను అనే వ్యక్తి ఇతరులకు ఇంజక్షన్లను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని, సోదాలు నిర్వహించగా, 380 నిషేధిత మత్తు కలిగించే ఇంజక్షన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఖరగ్‌పూర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. వీటిని ఒక్కోటి రూ.70కు కొనుగోలు చేసి నగరంలో యువతకు రూ.200కు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. మత్తు ఇంజక్షన్ల స్వాధీనంలో కీలక పాత్ర పోషించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ శ్రీనాథుడు, సెబ్‌ టాస్క్‌ఫోర్స్‌ సి.ఐ.లు కల్యాణి, చౌదరి, సురేష్‌, ఇతర అధికారులు, సిబ్బందిని జేడీ శ్రీనివాసరావు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని