logo

22 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌

ఉపాధ్యాయులు మెరుగ్గా పాఠ్యాంశాలను బోధించాలని డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్‌ ఆదేశించారు. ఆయన బుధవారం తాండవ, యర్రవరంలోని జడ్పీ పాఠశాలలను తనిఖీ చేశారు.

Published : 02 Feb 2023 05:22 IST

ట్యాబ్‌ల వినియోగంపై ఆరా తీస్తున్న డిప్యూటీ డీఈవో

నాతవరం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు మెరుగ్గా పాఠ్యాంశాలను బోధించాలని డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్‌ ఆదేశించారు. ఆయన బుధవారం తాండవ, యర్రవరంలోని జడ్పీ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ పాఠశాలల్లో 22 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. తాండవలో తెలుగు, గణితం పాఠ్యాంశాలను పూర్తిచేయలేదన్నారు. మధ్యాహ్నం భోజనం రుచి చూశారు. యర్రవరంలో 8వ తరగతి విద్యార్థులకిచ్చిన టాబ్‌లను ఎలా వాడుతున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. వీటి ని సరిగ్గా వినియోగించేలా ఉపాధ్యాయుiలు చొరవ చూపాలన్నారు. జాలారిపేట, కురువాడ ప్రాథమిక పాఠశాలలనూ పరిశీలించారు. ఎంఈవో అమృతకుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని