logo

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే క్రిమినల్‌ చర్యలు

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని అచ్యుతాపురం తహసీల్దార్‌ శ్రీనివాసరావు హెచ్చరించారు. మోసయ్యపేటలో భూముల ఆక్రమణపై ‘అధికారులు మారారు.... అడ్డెవరు?’ శీర్షికన ‘ఈనాడు’లో బుధవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారుల స్పందించారు.

Published : 02 Feb 2023 05:22 IST

సెంట్రింగ్‌ చెక్కల తొలగింపు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని అచ్యుతాపురం తహసీల్దార్‌ శ్రీనివాసరావు హెచ్చరించారు. మోసయ్యపేటలో భూముల ఆక్రమణపై ‘అధికారులు మారారు.... అడ్డెవరు?’ శీర్షికన ‘ఈనాడు’లో బుధవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారుల స్పందించారు. సర్వేనెంబర్‌ 207లో ఆక్రమణకు గురైన 1.39 ఎకరాల గెడ్డ పోరంబోకు స్థలాన్ని అధికారులు పరిశీలించారు. అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి స్తంభాలకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు. నిర్మాణానికి ఉపయోగించిన సెంట్రింగ్‌ చెక్కలను తొలగించారు. ప్రభుత్వ భూములను కాపాడడానికి అందరూ కలిసిరావాలని తహసీల్దార్‌ కోరారు. నిరంతర వీటిపై నిఘా ఉంచాలని వీఆర్వోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.ఐ. కుమార్‌, వీఆర్వో చినఅప్పారావు పాల్గొన్నారు.

హెచ్చరిక బోర్డు ఏర్పాటు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని