logo

హమ్మయ్య.. తరగతులన్నీ ఒకే చోట..!

గాజువాక సమీప సింహగిరి   కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కష్టాలు కొంత మేర తీరాయి. ‘నాడు- నేడు’ పథకం కింద ఇక్కడి పాఠశాల భవనాన్ని గతంలో కూల్చేశారు.

Published : 02 Feb 2023 05:22 IST

అద్దె భవనంలోని గదిలో విద్యార్థులు

న్యూస్‌టుడే, గాజువాక: గాజువాక సమీప సింహగిరి   కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కష్టాలు కొంత మేర తీరాయి. ‘నాడు- నేడు’ పథకం కింద ఇక్కడి పాఠశాల భవనాన్ని గతంలో కూల్చేశారు. కొత్తగా చేపట్టిన నిర్మాణ పనులు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. చిన్నారులను అదే కాలనీలోని వేర్వేరు ఇంటి ప్రాంగణాల్లో కూర్చొబెట్టి బోధన సాగిస్తున్నారు. ఈ సమస్యపై గత నెల 28న ‘ఈనాడు’లో ‘ఈ బడి ఏ క్షణమైనా రోడ్డున పడొచ్చు!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన డీఈఓ చంద్రకళ గత నెల 29న  పాఠశాలను పరిశీలించి.. అన్ని తరగతులు ఒకే చోట ఉండేలా అద్దె భవనంలో నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ  చేశారు. ప్రస్తుత పాఠశాలకు 250 మీటర్ల దూరంలోనే ఓ అద్దె భవనాన్ని తీసుకుని మంగళవారం నుంచి అన్ని తరగతులను ఒకే చోట  నిర్వహిస్తున్నారు.

గత నెల 28న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని