logo

ఏప్రిల్‌ నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు

ఏప్రిల్‌ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లను అన్ని సదుపాయాలతో లబ్ధిదారులకు అందజేయాలని గుత్తేదారులను టిడ్కో ఛైర్మన్‌ ప్రసన్న కుమార్‌ ఆదేశించారు.

Published : 03 Feb 2023 03:28 IST

సమావేశంలో మాట్లాడుతున్న టిడ్కో ఛైర్మన్‌ ప్రసన్న కుమార్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఏప్రిల్‌ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లను అన్ని సదుపాయాలతో లబ్ధిదారులకు అందజేయాలని గుత్తేదారులను టిడ్కో ఛైర్మన్‌ ప్రసన్న కుమార్‌ ఆదేశించారు. వీఎంఆర్‌డీఏ భవనంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ‘టిడ్కో’ ఇళ్ల పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఏప్రిల్‌ 23 నాటికి విశాఖపట్నంలో 6,728, శ్రీకాకుళంలో 2,720, విజయనగరంలో 4,224 గృహాలను అందిస్తామని తెలిపారు. గృహాల నిర్మిత ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి, మంచినీరు, విద్యుత్తు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలన్నారు. టిడ్కో ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన కలిగేలా ఏపీ టిడ్కో యూట్యూబ్‌ ఛానెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. టిడ్కో కార్యక్రమాలన్నీ తెలియజేసే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే విషయంలో సహాయం చేయాలని సూచించారు. గత నాలుగు నెలల్లో ఉమ్మడి విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో యాభైవేల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని తెలిపారు.  అనంతరం జీవీఎంసీ పరిధిలో గృహప్రవేశాలు జరిగిన 13 ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో టిడ్కో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ డి.శ్రీరామమూర్తి, యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్‌  పాపు నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌, జ్యోతి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బాలకృష్ణ, సహోద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్లొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని