logo

ధాన్యం కొనుగోలులో సర్కారు దగా

ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 03:28 IST

అనిత మండిపాటు

ధాన్యం గాలిపోత పనుల్లో అనిత

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. వరి ఎందుకు సాగు చేశామా అని అన్నదాతలు బాధ పడుతున్నారన్నారు. ఎస్‌.రాయవరం మండలం వెంకటాపురంలో గురువారం రైతుల కల్లాలకు వెళ్లి ధాన్యం నిల్వలను పరిశీలించారు. వారితో కలిసి గాలిపోత పనులు చేశారు. అనంతరం అనిత మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. ఫలితంలో కల్లాల్లోనే రోజుల తరబడి నిల్వ ఉంచాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి ఖర్చులూ వచ్చే ఆస్కారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన విత్తనంతోనే సాగు చేశారని, ఇప్పుడు ధాన్యం కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రం సిబ్బంది కల్లాల్లోనే ధాన్యం తూకం వేసి మిల్లర్ల వద్దకు చేర్చడంతోపాటు 21 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు వేస్తారని ముఖ్యమంత్రి చెప్పారని.. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. మిల్లర్లు రైతులకు సహకరించలేదన్నారు. ధాన్యం కొనుగోలుకు గడువు పెట్టడం దారుణమన్నారు. రైతుల పక్షాన తెదేపా పోరాటం చేస్తుందని, సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. తెదేపా నాయకులు వినోద్‌రాజు, అమలకంటి అబద్ధం, కొప్పిశెట్టి వెంకటేష్‌, నల్లపరాజు వెంకటరాజు, కందుల వెంకటేశ్వరరావు, గుర్రం రామకృష్ణ, పల్లెల జగ్గారావు, ఆకేటి శాంతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు