logo

కోరిక తీర్చలేదని వివాహితపై హత్యాయత్నం

కోరిక తీర్చలేదనే అక్కసుతో వివాహితపై హత్యాయత్నం చేసి, ఆ తరవాత మనస్తాపంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఉదంతం రోలుగుంట మండలం కంచుగుమ్మలలో చోటుచేసుకుంది.

Published : 03 Feb 2023 03:28 IST

ఆత్మహత్యకు యత్నించిన రమణ

రోలుగుంట, న్యూస్‌టుడే: కోరిక తీర్చలేదనే అక్కసుతో వివాహితపై హత్యాయత్నం చేసి, ఆ తరవాత మనస్తాపంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఉదంతం రోలుగుంట మండలం కంచుగుమ్మలలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఇద్దరినీ చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించామని రోలుగుంట ఎస్సై బి.నాగకార్తీక్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం... మండలంలోని గుండుబాడు శివారు బలిజిపాలెం గ్రామానికి చెందిన వివాహితకు, అదే గ్రామానికి చెందిన కోడి రమణతో వివాహేతర సంబంధం ఉంది. గతంలో గంజాయి కేసులో పోలీసులు రమణను అరెస్ట్‌ చేయగా కొద్దిరోజుల క్రితమే విడుదలై గ్రామానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న వివాహిత అతడికి దూరంగా ఉండాలని తల్లిని తీసుకుని ఇదే మండలం కంచుగుమ్మలలోని బంధువుల ఇంటిలో బుధవారం రాత్రి తలదాచుకుంది. నిందితుడు రమణ కంచుగుమ్మల చేరుకుని వివాహిత మెడపై కత్తితో దాడి చేసినట్టు ఫిర్యాదు అందిందని ఎస్సై నాగకార్తీక్‌ వివరించారు. తీవ్ర గాయాలతో వివాహితను చికిత్స నిమిత్తం తరలించారు. తరవాత కొద్దిసేపటికే నిందితుడు రమణ పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని ఎస్సై వివరించారు. కేసులు నమోదుచేసి చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామన్నారు. ఇదిలా ఉండగా బాధితురాలిని, కుటుంబ సభ్యులను ఎస్పీ గౌతమి సాలి పరామర్శించి ఓదార్చారు. ఆందోళన చెందొద్దన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని