logo

విద్యార్థులకు వరం జగనన్న విదేశీ విద్యాదీవెన

జగనన్న విదేశీ విద్యాదీవెన విద్యార్థులకు వరమని కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. శుక్రవారం జగనన్న విదేశీ విద్యాదీవెన లబ్ధిదారులకు ఆర్థిక సాయం మంజూరు చేశారు.

Published : 04 Feb 2023 05:03 IST

జగనన్న విదేశీ విద్యాదీవెన చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ రవి

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జగనన్న విదేశీ విద్యాదీవెన విద్యార్థులకు వరమని కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. శుక్రవారం జగనన్న విదేశీ విద్యాదీవెన లబ్ధిదారులకు ఆర్థిక సాయం మంజూరు చేశారు. ముందుగా తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్‌ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు. అనంతరం జిల్లాలో అయిదుగురు విద్యార్థులకు సంబంధించి రూ. 49.50 లక్షల చెక్కును లబ్ధిదారులతో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్నతమైన క్యూ.ఎస్‌ ర్యాంకు కలిగిన విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలలో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులు అభ్యసించే రూ. 8 లక్షలలోపు ఆదాయంగల బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ఏటా ఏడాది రెండు పర్యాయాలు దరఖాస్తు చేసుకొనే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. 35 ఏళ్లలోపు వయసు, 60 శాతం మార్కులు ఉండాలన్నారు. నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు విదేశాల్లో  చదువుకోవడానికి ప్రభుత్వం నగదు విడుదల చేసిందన్నారు. నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు కె.రాజేశ్వరి, అజయ్‌బాబు, అధికారులు పాల్గొన్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు