logo

ధిక్కార స్వరం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఓడలు బళ్లు.. బళ్లు ఓడలుగా మారడమంటే ఇదేనేమో. ఇన్నాళ్లూ.. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వర్గంగా ఉంటూ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన నాయకులు ఆయనకు దూరమయ్యారు

Updated : 04 Feb 2023 05:56 IST

ఎమ్మెల్యే బాబూరావుకు అసమ్మతి సెగ!

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఓడలు బళ్లు.. బళ్లు ఓడలుగా మారడమంటే ఇదేనేమో. ఇన్నాళ్లూ.. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వర్గంగా ఉంటూ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన నాయకులు ఆయనకు దూరమయ్యారు. ఎమ్మెల్యే ఆదేశాలను బేఖాతరు చేస్తూ బహిరంగంగానే ధిక్కార స్వరం వినిపించారు. పేట ఉప ఎంపీపీగా ఎమ్మెల్యే ఇచ్చిన బీఫారంను పక్కన పెట్టి రెబల్‌ను గెలిపించడం గమనార్హం.

* గతంలో ఎస్‌.రాయవరం మండలానికి చెందిన బొలిశెట్టి గోవిందరావు, పాయకరావుపేటకు చెందిన వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు తదితరులు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డారు. వీరి మధ్య రచ్చ రోడ్డుకు ఎక్కింది. పరిస్థితిని గమనించిన అధిష్ఠానం వారి మధ్య సయోధ్య కుదిర్చింది. బొలిశెట్టి గోవిందరావు ఇప్పటికీ ఎమ్మెల్యేతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు చిక్కాల రామారావు, ఆయన వర్గీయులు ఎమ్మెల్యే బాబూరావుతో సన్నిహితంగా ఉంటున్నారు. తాజాగా పేట ఉప ఎంపీపీ-2 ఎన్నికకు ఎంపిక చేసిన అభ్యర్థి విషయంలో చిక్కాల వర్గీయులైన వైకాపా మండల అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గూటూరు శ్రీనివాసరావు తదితరులు అసంతృప్తికి లోనయ్యారు. ఎమ్మెల్యే తమతో సంప్రదించకుండా ఎంపీటీసీ సభ్యుడు సతీష్‌రాజుకు బీఫారం ఇవ్వడంతో వీరి అసంతృప్తికి కారణమైంది. వీరంతా ఏకమై ఎస్‌.నర్సాపురం ఎంపీటీసీ సభ్యుడు మణికంఠస్వామిని బరిలోకి దించి విజయం సాధించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్తేరుకు చెందిన దేవవరపు సూర్యచక్రం మాట్లాడుతూ.. పార్టీ కోసం శ్రమించే నాయకులు, కార్యకర్తల మాటలకు విలువ ఇవ్వకపోతే ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం అవుతాయన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారి మాటకు విలువ ఇవ్వకపోవడంతోనే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని పేటకు చెందిన కొందరు నాయకులు ప్రకటించారు. ఎవరో చెప్పిన వాటికే ఎమ్మెల్యే బాబూరావు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని బహిరంగంగా విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని