logo

ఎస్‌.రాయవరం ఎంపీపీగా లోవ లక్ష్మి

మండల పరిషత్తు అధ్యక్షురాలిగా పెనుగొల్లు ఎంపీటీసీ సభ్యురాలు కోన లోవలక్ష్మి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఎన్నికల అధికారి లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.

Published : 04 Feb 2023 05:07 IST

ప్రమాణస్వీకారం చేస్తున్న లోవలక్ష్మి

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: మండల పరిషత్తు అధ్యక్షురాలిగా పెనుగొల్లు ఎంపీటీసీ సభ్యురాలు కోన లోవలక్ష్మి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఎన్నికల అధికారి లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. 20 మంది సభ్యులకు వైకాపా నుంచి 15 మంది, జనసేన నుంచి ఒకరు హాజరయ్యారు. తెదేపా సభ్యులు ముగ్గురు, లింగరాజుపాలెం ఎంపీటీసీ సభ్యురాలు హాజరు కాలేదు. వైస్‌ ఎంపీపీ-1 కోన లోవలక్ష్మి పేరును ఎంపీసీ పదవికి చినగుమ్ములూరు ఎంపీటీసీ సభ్యురాలు బొలిశెట్టి శారదాకుమారి ప్రతిపాదించారు. ఎస్‌.రాయవరం-1 ఎంపీటీసీ సభ్యుడు బైపా శ్రీనివాసరావు ఆమెను బలపరిచారు. సభ్యులంతా ఒక్కరినే ఎంపీపీగా ప్రతిపాదించడంతో లోవలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.

కొద్దిసేపు ఉత్కంఠ

ఉదయం 11 గంటలకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. ఎంపీటీసీ సభ్యులు ఎవరూ మండల పరిషత్తు సమావేశ మందిరానికి రాలేదు. నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య బీ-ఫారంతో కార్యాలయంలో ఉన్నారు. ఆ సమయంలో ఎంపీటీసీ సభ్యులంతా కొరుప్రోలులో ఎమ్మెల్యే గొల్ల బాబూరావును కలిశారు. ఎంపీపీగా రాజీనామా చేసిన శారదాకుమారిని మళ్లీ ఎంపీపీగా ఎన్నుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు నడుచుకుంటానని, మీకు నచ్చిన వారిని ఎన్నుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులంతా మండల పరిషత్తు కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో బొలిశెట్టి గోవిందరావు, శారదాకుమారి దంపతులూ వచ్చారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని