జీవీఎంసీ నిర్ణయంపై మండిపాటు
విశాఖ నగర పరిధిలోని ముడసర్లోవ పార్కును పీపీపీ (ప్రభుత్వ, ప్రైయివేటు భాగస్వామ్యం) పద్ధతిలో ప్రయివేటు పరం చేసే నిర్ణయానికి జీవీఎంసీ కౌన్సిల్‌లో ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు శుక్రవారం పెద్ద సంఖ్యలో పార్కు ముఖ ద్వారం వద్ద నిరసన చేపట్టారు
ముడసర్లోవ పార్కును ప్రయివేటుపరం చేయొద్దని ఆందోళన
పార్కు ముందు బైఠాయించిన తెదేపా నాయకులు
ఆరిలోవ, విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: విశాఖ నగర పరిధిలోని ముడసర్లోవ పార్కును పీపీపీ (ప్రభుత్వ, ప్రైయివేటు భాగస్వామ్యం) పద్ధతిలో ప్రయివేటు పరం చేసే నిర్ణయానికి జీవీఎంసీ కౌన్సిల్‌లో ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు శుక్రవారం పెద్ద సంఖ్యలో పార్కు ముఖ ద్వారం వద్ద నిరసన చేపట్టారు. అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. జీవీఎంసీ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, దక్షిణ, భీమిలి నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు గండి బాబ్జి, కోరాడ రాజబాబు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి సన్యాసిరావు, పలువురు తెదేపా కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
* ఇదే విషయంపై సీపీఎం శ్రేణులు కూడా ఆ పార్టీ నాయకులు ఆర్కేఎస్వీ కుమార్, పి.శంకర్ తదితరుల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్కు చుట్టూ నిర్మిస్తున్న రక్షణ గోడ పనులను పరిశీలించి ర్యాలీ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ