logo

వ్యర్థాలపై అలలే.. విదేశీయులొస్తే హడలే!!

ఈ నెలాఖరులో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు, జీ-20 సన్నాహక సమావేశాల నిమిత్తం విశాఖ సాగర తీర ప్రాంతాల్లో సుందరీకరణపై అధికారులు దృష్టిసారించారు. పేరుగాంచిన రుషికొండ సాగరతీరానికి విదేశీయులు వస్తారని అంచనా.

Published : 05 Feb 2023 02:47 IST

ఇదీ.. రుషికొండ తీరంలో  అధ్వాన పరిస్థితి

ఈ నెలాఖరులో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు, జీ-20 సన్నాహక సమావేశాల నిమిత్తం విశాఖ సాగర తీర ప్రాంతాల్లో సుందరీకరణపై అధికారులు దృష్టిసారించారు. పేరుగాంచిన రుషికొండ సాగరతీరానికి విదేశీయులు వస్తారని అంచనా.

బ్లూఫ్లాగ్‌ గుర్తింపు ఉన్న ఈ తీరం పలు చోట్ల ప్రస్తుతం డంపింగ్‌ యార్డులా మారింది. పేరుకుపోతున్న చెత్త, వస్త్రాల పీలికలు కాళ్లకు అడ్డుపడుతుండటంతో సందర్శకులు హడలిపోతున్నారు. నీటిలోకి దిగాలంటేనే జంకుతున్నారు. కొందరు ఆచితూచి అడుగేస్తున్నారు. సదస్సుల సమయానికి ఈ పరిస్థితిని మార్చకుంటే నగర పర్యాటక రంగానికి మచ్చ తప్పదని పర్యాటకులు భావిస్తున్నారు.

ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని