logo

నకిలీ అధికారి గుట్టురట్టు

జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి వచ్చానంటూ తనిఖీల పేరిట హడావుడి చేయబోయిన మోసగాడు ఉపాధ్యాయుల చేతికి చిక్కాడు.

Updated : 05 Feb 2023 04:11 IST

కశింకోట, న్యూస్‌టుడే: జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి వచ్చానంటూ తనిఖీల పేరిట హడావుడి చేయబోయిన మోసగాడు ఉపాధ్యాయుల చేతికి చిక్కాడు. కశింకోట డీపీఎన్‌ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు శనివారం ఓ వ్యక్తి వచ్చాడు. తాను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి వచ్చానని, మధ్యాహ్న భోజన పథకం అమలును తనిఖీ చేయాల్సి ఉందని చెప్పాడు. అతడి తీరును చూసిన అనుమానించిన ప్రధానోపాధ్యాయుడు ఎ.శ్రీధర్‌రెడ్డి వెంటనే జిల్లా  విద్యాశాఖాధికారి కార్యాలయానికి ఫోన్‌ చేసి ఆరాతీశారు. తాము ఎవర్నీ తనిఖీలకు పంపలేదని అక్కడి అధికారులు చెప్పారు. దీంతో గుర్తింపు కార్డు చూపాలని ఆ వ్యక్తిని అడగ్గా.. తాను విధుల్లో చేరి వారం రోజులే అయిందని పేర్కొన్నాడు. ప్రొసీడింగ్స్‌ చూపమని అడిగితే ప్రిన్సిపల్‌ సెక్రటరీ పేరుతో ఉన్న కాగితాలను చూపాడు. అవి నకిలీవని గుర్తించి అతడిని మూడు గంటలపాటు పాఠశాలలో ఉంచారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పగా.. క్షమించాలంటూ వేడుకున్నాడని హెచ్‌ఎం చెప్పారు. అతడి ఆధాô్ వివరాలు, ఇతర ధ్రువపత్రాల నకళ్లను తీసుకుని పంపినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో ఇతడు రోలుగుంట మండలంలోని నాలుగు పాఠశాలను సందర్శించినట్లు విజిట్‌ రిపోర్టు చూపాడని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని