logo

గీతంలో సందడే సందడి

గీతం డీమ్డ్‌ వర్సిటీలో ఉత్సాహంగా జరుగుతున్న ‘షోర్‌ఫెస్ట్‌ -23’ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శనివారం యువత సామాజిక, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి వాతావరణం నెలకొంది.

Published : 05 Feb 2023 02:47 IST

స్ఫూర్తిని నింపే ప్రదర్శనలు
ప్రత్యేక ఆకర్షణగా సినీనటి రెజీనా

నిర్వాహక విద్యార్థులతో సినీ నటి రెజీనా

సాగర్‌నగర్‌,న్యూస్‌టుడే: గీతం డీమ్డ్‌ వర్సిటీలో ఉత్సాహంగా జరుగుతున్న ‘షోర్‌ఫెస్ట్‌ -23’ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శనివారం యువత సామాజిక, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి వాతావరణం నెలకొంది. సినీ నటి రెజీనా కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులతో ముచ్చటించారు. పర్యావరణ పరిరక్షణ, సేవ్‌ సోయిల్‌ (నేల సంరక్షణ) తదితర ప్రయోజనకర అంశాల ప్రాధాన్యాన్ని అభివర్ణించేలా ప్రకృతి ప్రేమికుల ప్రదర్శనలు అందరిలో స్ఫూర్తిని నింపాయి. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో వస్త్రధారణలు, వివిధ భంగిమల్లో చేసిన నృత్యాలు ఎంతగానో అలరించాయి. గీతం (విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు) ప్రాంగణాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ ఫెస్ట్‌ ఆనందోత్సహాల నడుమ వేడుకగా నిర్వర్తిస్తున్నారు. ప్రొ-వీసీ ఆచార్య వై.గౌతమ్‌రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య డి.గుణశేఖరన్‌, స్టూడెంట్‌ లైఫ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రాహుల్‌ సింగ్‌, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ అరుణ్‌కార్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.

హుషారైన నృత్యాలతో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని