logo

హుండీల చోరీ కేసులో నలుగురి అరెస్టు

ఆలయాల్లో హుండీలను చోరీ చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కి పంపించినట్లు అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ తెలిపారు.

Published : 05 Feb 2023 02:47 IST

వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ సునీల్‌

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: ఆలయాల్లో హుండీలను చోరీ చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కి పంపించినట్లు అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ తెలిపారు. బుచ్చెయ్యపేట, కొండపాలెం, దిబ్బిడి గ్రామాల్లో ఆలయాల్లో హుండీలు గురువారం రాత్రి చోరీకి గురైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. రోలుగుంట మండలం జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన పడాల సతీష్‌కుమార్‌, మరిశా శ్యామ్‌కుమార్‌, బలిరెడ్డి జనార్దన్‌, మరొక మైనర్‌ కలిసి ఈ వరుస దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. వారి నుంచి రూ. 24 వేల సొమ్మును స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణ చేస్తున్నప్పుడు ఇదే వ్యక్తులు రావికమతం మండలం చినపాచిల ఆలయంలోనూ చోరీ పాల్పడినట్లు అంగీకరించారని చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో ఎస్సై కుమారస్వామి, అదనపు ఎస్సై నాయుడు, హెడ్‌ కానిస్టేబుల్‌ అర్జున, కానిస్టేబుల్‌ శివ కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. ఒకరోజులోనే నిందితులను పట్టుకోవడంపై వారిని అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని