logo

పారిశుద్ధ్య కార్మిక పోస్టులకు బేరాలు!

చెత్త సేకరణ కార్మికులుగా అవకాశం కల్పిస్తామని పలువురు వైకాపా ప్రజాప్రతినిధులు బేరసారాలు ప్రారంభించారు. నగరంలో గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి చెత్త సేకరించడానికి అవసరమైన కార్మికుల నియామకానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

Published : 05 Feb 2023 02:47 IST

వైకాపా ప్రజాప్రతినిధుల వ్యూహాలు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: చెత్త సేకరణ కార్మికులుగా అవకాశం కల్పిస్తామని పలువురు వైకాపా ప్రజాప్రతినిధులు బేరసారాలు ప్రారంభించారు. నగరంలో గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి చెత్త సేకరించడానికి అవసరమైన కార్మికుల నియామకానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. దీంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు ఒక్కో నియామకానికి రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షలు వరకు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 595 మంది కార్మికులతో ఈ నెల 11 నుంచి మార్చి 31 వరకు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయించడానికి ఇటీవల కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో నియామకం పూర్తయి గడువు ముగిసిన తరువాత వారిని కొనసాగించేలా పలువురు పాలకవర్గ సభ్యులు పావులు కదుపుతున్నారు. నియామకాలకు గడువు దగ్గర పడుతుండటంతో డబ్బులిచ్చిన వారి జాబితాను త్వరలో జీవీఎంసీకి అందజేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పనిచేసే కార్మికునికి రోజుకు రూ.549 వేతనం ఇవ్వాలని జీవీఎంసీ నిర్ణయించింది. నెలలో 26 రోజులకుగానూ రూ.14,274 వేతనం ఒక్కొక్కరికి అందనుంది. ఉదయం 9 గంటల తరువాత ఏదైనా పనిచేసుకోవడానికి కార్మికుడికి అవకాశం ఉండటంతో ఈ పోస్టులకు డిమాండ్‌ నెలకొంది. అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, కార్యకర్తలతో జాబితా తయారు చేయించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని