logo

మంత్రి అమర్‌నాథ్‌ వ్యాఖ్యలపై నిరసన

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నాయకులు పీవీ శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 06 Feb 2023 04:45 IST

ఆందోళనలో పాల్గొన్న జనసేన నాయకులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నాయకులు పీవీ శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. పవన్‌ను తెదేపా సీనియర్‌ కార్యకర్తగా పేర్కొనడాన్ని నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీˆ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్యానర్‌పై సీఎం జగన్‌, మంత్రి అమర్‌నాథ్‌కు సంబంధించిన చిత్రాలను ముద్రించి ప్రదర్శించారు. తండ్రి మృతి చెందిన తరువాత అమర్‌నాథ్‌ తెదేపాలో చేరిన రోజులు మరిచిపోయారన్నారు. చంద్రబాబు విజన్‌ను పొగుడుతూ, జగన్‌ను తిట్టిన వీడియోలు ఇంకా చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని చెప్పుల దండతో ఉన్న అమర్‌నాథ్‌ దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు