logo

భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపాలపట్నంలో చోటు చేసుకుంది.

Published : 06 Feb 2023 04:45 IST

నవీన్‌ (పాతచిత్రం)

గోపాలపట్నం, న్యూస్‌టుడే : భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపాలపట్నంలో చోటు చేసుకుంది. ఆదివారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు... తెలంగాణలోని వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ముగ్దుంపురం గ్రామానికి చెందిన ఎం.నవీన్‌ (23)కు, విశాఖలోని 91వ వార్డు లక్ష్మీనగర్‌కు చెందిన యువతితో మూడేళ్ల కిందట వివాహమైంది. నగరంలో వంట మాస్టర్‌గా పని చేస్తున్న నవీన్‌ శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత... మరొకరితో ఎక్కువసేపు చరవాణిలో మాట్లాడుతుండగా భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో గదిలోకి వెళ్లిన నవీన్‌ ఫ్యాన్‌ హుక్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సీఐ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు