logo

ఉపాధ్యాయినిలపై చర్యలకు ఆదేశం

పెదగదిలి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిలపై చర్యలకు ఆదేశించినట్లు విద్యాశాఖాధికారిణి ఎల్‌.చంద్రకళ తెలిపారు.

Published : 06 Feb 2023 04:45 IST

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : పెదగదిలి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిలపై చర్యలకు ఆదేశించినట్లు విద్యాశాఖాధికారిణి ఎల్‌.చంద్రకళ తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా శనివారం పెదగదిలి ప్రాథమిక పాఠశాలను సందర్శించినపుడు ఇద్దరు ఉపాధ్యాయినిలు విధుల్లో లేరన్నారు. ఎందుకు లేరో సమాచారం కూడా లేదన్నారు. దీనిపై తగు చర్యలకు ఎంఈఓ పైడపు నాయుడుకు ఆదేశించిటం జరిగిందన్నారు. వారికి ఇంక్రిమెంటు నిలుపుదల ఎందుకు చేయకూడదో వివరణ కోరాలని ఎం.ఇ.ఒ.ను ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని