logo

శ్మశానాల అభివృద్ధి వెనుక అవినీతి తంత్రం

విశాఖ నగర వీధుల్లో దారులు ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రూ.32 కోట్లతో 57 శ్మశానాలు అభివృద్ధి చేయాలని పాలకవర్గం నిర్ణయించడం కేవలం పర్సంటేజీల కోసమేనని 22వ వార్డు జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని జనసేన ఫ్లోర్‌లీడర్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated : 07 Feb 2023 05:55 IST

జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ఆరోపణ

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: విశాఖ నగర వీధుల్లో దారులు ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రూ.32 కోట్లతో 57 శ్మశానాలు అభివృద్ధి చేయాలని పాలకవర్గం నిర్ణయించడం కేవలం పర్సంటేజీల కోసమేనని 22వ వార్డు జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని జనసేన ఫ్లోర్‌లీడర్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముడసర్లోవలో 284 ఎకరాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే నిర్ణయంపైనా  న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. జీవీఎంసీలో 595 మంది పారిశుద్ధ్య కార్మికుల నియామకంలో అక్రమాలకు తెరతీశారన్నారు. మెకానికల్‌ విభాగంలో వాహనాల నిర్వహణ పేరుతో అడ్డంగా దోచేస్తున్నారని, గత ఏడాది కంటే ఇప్పుడు 100 శాతం అదనంగా ఖర్చు చేస్తుండడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. బీచ్‌ల సుందరీకరణ పేరుతో సీఆర్‌జెడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు.  33వ వార్డు కార్పొరేటర్‌ వసంతలక్ష్మికి సమాచారం లేకుండా రూ.27లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని, ఇదెక్కడి తీరని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు