logo

అంగన్‌వాడీ కార్యకర్తల పోరుబాట

అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ (సీఐటీయూ) గౌరవాధ్యక్షులు పి.మణి డిమాండ్‌ చేశారు.

Published : 07 Feb 2023 05:02 IST

ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ (సీఐటీయూ) గౌరవాధ్యక్షులు పి.మణి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. రూ.26 వేల వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ కలెక్టర్‌ కార్యాలయానికి రావద్దని అర్ధరాత్రి నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.దేవి మాట్లాడుతూ అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన చరవాణులు పనిచేయడం లేదన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌ మాట్లాడుతూ గత మూడ్నెళ్లుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు.  అనంతరం అర్బన్‌-2 సీడీపీఓ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని