logo

ప్రజలకు ఆపదలో మిత్రుల్లా వ్యవహరించాలి

వార్డు, గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ప్రజలకు ఆపద వచ్చినప్పుడు మిత్రుల్లా సహాయ పడాలని జిల్లా పరిషత్‌ సీఈవో పి.శ్రీరామమూర్తి పిలుపునిచ్చారు.

Published : 07 Feb 2023 05:02 IST

జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీరామమూర్తి

శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న జెడ్పీ సీఈవో శ్రీరామమూర్తి

పెందుర్తి, న్యూస్‌టుడే: వార్డు, గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ప్రజలకు ఆపద వచ్చినప్పుడు మిత్రుల్లా సహాయ పడాలని జిల్లా పరిషత్‌ సీఈవో పి.శ్రీరామమూర్తి పిలుపునిచ్చారు. పెందుర్తిలోని టీటీడీసీ కేంద్రంలో చేపట్టిన ‘ఆపద మిత్ర’ శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఆపద కలిగినా నిత్యం ప్రజల్లో ఉండే వాలంటీర్లు తక్షణమే స్పందించి సంబంధిత శాఖలకు సమాచారం అందించాలన్నారు. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నిపుణులు శిక్షణ అందిస్తారన్నారు. అనంతరం వ్యక్తిగత భద్రత సామగ్రి అందజేస్తామన్నారు. శిబిరం పరిశీలకుడు, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ కమిషనర్‌ ఇ.కృష్ణమోహన్‌ శిక్షణ ఉద్దేశం, పద్ధతులను వివరించారు. పెందుర్తి ఎంపీడీవో కొల్లి వెంకటరావు, టీవోటీ కె.కరుణాకర్‌, రిసోర్స్‌ పర్సన్లు మహేశ్‌, సుధాకర్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు ఢిల్లేశ్వరరావు, ధర్మారావు, జిల్లా శిక్షణ మేనేజర్‌ చంద్రశేఖర్‌, నగర పరిధిలోని వాలంటీర్లు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని