logo

జగనన్న ఇళ్లకు రూ.5లక్షలు కేటాయించాలి: సీపీఐ

జగనన్న కాలనీల్లో చేపట్టే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలని సీపీఐ విశాఖ జిల్లా సమితి డిమాండ్‌ చేసింది.

Published : 07 Feb 2023 05:02 IST

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న సీపీఐ శ్రేణులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో చేపట్టే ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలని సీపీఐ విశాఖ జిల్లా సమితి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కాలనీల్లో కనీస సదుపాయాలు కల్పించలేదన్నారు. నిధులు సరిపోకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారని, దీంతో జగనన్న కాలనీలు ఎడారులను తలపిస్తున్నాయన్నారు. సిమెంట్‌, స్టీలు, కంకర, ఇటుక, చెక్క తదితరాల ధరలు అనూహ్యంగా పెరిగాయని, ఫలితంగా ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80లక్షలు ఏ మూలకు సరిపోవడం లేదన్నారు. లబ్ధిదారులు రూ.35వేలు ఇస్తే మిగతా నిధులు విడుదల చేస్తామని చెప్పడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి, పైడిరాజు, మన్మథరావు, సత్యనారాయణ, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు