క్యాజువాల్టీ విభాగానికి కొత్త రూపు
కేజీహెచ్ క్యాజువాల్టీ విభాగ రూపురేఖలు మారాయి. కలెక్టర్ మల్లికార్జున చూపిన చొరవతో ఈ విభాగంలో పలు వసతులు అందుబాటులోకి వచ్చాయి.
అందుబాటులోకి ఆధునిక వసతులు
కేజీహెచ్‌లో ఆధునికీకరించిన ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం
వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్ క్యాజువాల్టీ విభాగ రూపురేఖలు మారాయి. కలెక్టర్ మల్లికార్జున చూపిన చొరవతో ఈ విభాగంలో పలు వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఓపీ చీటీలు జారీ చేసే కౌంటర్ల సంఖ్య 11కు పెరిగింది. క్యాజువాల్టీ ఫ్లోరును మార్చారు. గ్రానైట్ బెంచీలు, ఫాల్స్ సీలింగ్, ఫౌంటెయిన్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టారు. క్యాజువాల్టీలో ఉన్న 20 పడకలకు కర్టెన్లు వేసి తీర్చి దిద్దారు. వైద్యుల గదుల్లో వసతులు కల్పించారు. ఆయా పనులకు రూ.30లక్షల మేర ఖర్చు చేశారు. మరో రూ.40లక్షలతో మహిళలు, పురుషులు, పిల్లలకు వేర్వేరుగా ఓపీ కౌంటర్లు, ఓపీ చీటీలు రాసే గదులకు ఏసీలు అమర్చారు. భావనగర్ వార్డు నుంచి రేడియాలజీ విభాగం వరకు రూ.13లక్షలతో పాత్‌వే ఏర్పాటు చేశారు. రూ.32లక్షల ఖర్చుతో రాజేంద్రప్రసాద్ వార్డులో 20 పడకలతో ఎ.ఎం.సి.యు. వార్డును ఆధునికీకరించామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి.అశోక్‌కుమార్ తెలిపారు. త్వరలో ఆయా పడకలకు వెంటిలేటర్లు అమర్చుతామన్నారు. మరో పది పడకలతో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వార్డును అందుబాటులోకి తెచ్చామన్నారు. క్యాజువాల్టీలో రూ.10లక్షలతో అల్యూమినియం క్యూబికల్స్, తలుపులు, కప్‌బోర్డు, వెంటిలేషన్ సదుపాయాలు మెరుగుపర్చామన్నారు. కలెక్టర్ సీఎస్‌ఆర్ కింద విడుదల చేసిన నిధులతో ఆయా పనులను చేపట్టామని డాక్టర్ అశోక్‌కుమార్ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..