logo

పేరుకే జలకళ.. లబ్ధి చేకూరలా!

పేద రైతుల భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ జలకళ పథకం కొమరవోలు రైతులు అవాక్కయ్యేలా చేసింది.

Published : 09 Feb 2023 04:27 IST

రైతుల ఆవేదన

రోలుగుంట, న్యూస్‌టుడే: పేద రైతుల భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ జలకళ పథకం కొమరవోలు రైతులు అవాక్కయ్యేలా చేసింది. చాలారోజుల క్రితం రిగ్గువేసి వదిలేసిన ఇద్దరు రైతులకు మొత్తం పథకమే పూర్తయినట్లు మంగళవారం ఫోన్లకు సమాచారం వచ్చింది.  

ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన కొత్తలో రోలుగుంట మండలానికి 72 మంజూరయ్యాయి. కొమరవోలు నుంచి సుమారు 30 మంది దరఖాస్తు చేశారు. మండల పరిధిలో 31 మందికే రిగ్గు వేశారు. ఇంకా 41 వేయాల్సి ఉంది. ఇందులో కొమరవోలుకు చెందిన సుమారు 13 మందికి రిగ్గులు వేశారు. నిబంధనల ప్రకారం బోరువేసి విద్యుత్తు కనెక్షన్‌తో పాటు మోటారును ప్రభుత్వమే అందజేస్తుందని చెప్పారు. రిగ్గులు వేసి చేతులు దులిపేసుకున్న అధికారులు ఆ తర్వాత వాటివంక చూడలేదు. ఈనెల 7న పోతల అప్పలనాయుడు, వంటాకుల నూకాలతల్లి రైతుల ఫోన్లకు ఈ పథకం కింద పూర్తిస్థాయిలో లబ్ధి అందించినట్లు సంక్షిప్త సమాచారం వచ్చింది. భవిష్యత్తులో మరో పథకానికి దరఖాస్తు చేస్తే తమకు జలకళ బోర్లు ద్వారా లబ్ధి పొందినట్లు చూపిస్తుందని, ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఏపీఓ సూర్యమణిని వివరణ కోరగా ఈపథకానికి సంబంధించి మార్గదర్శకాల్లో మార్పులు చేశారన్నారు. అలా ఎందుకు సమాచారం వచ్చిందో తమకు తెలియదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని