logo

వీధి వ్యాపారులపై ప్రతాపమా?!

జీ-20 సన్నాహక సమావేశాల పేరుతో నగరంలోని వీధి వ్యాపారాలు కొనసాగించొద్దని, వారిని అక్కడి నుంచి తొలగిస్తుండటం దారుణమని తెదేపా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

Updated : 09 Feb 2023 06:14 IST

తెదేపా నేతల ఆందోళన

ఆందోళనలో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు, తెదేపా నాయకులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జీ-20 సన్నాహక సమావేశాల పేరుతో నగరంలోని వీధి వ్యాపారాలు కొనసాగించొద్దని, వారిని అక్కడి నుంచి తొలగిస్తుండటం దారుణమని తెదేపా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో రహదారుల పక్కన ఉండే తోపుడు బళ్ల వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తెదేపా హయాంలో ఫ్లీట్‌ రివ్యూ సందర్భంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని చెప్పి, వారికి జీవనభృతి అందించిన విషయాన్ని గుర్తు చేశారు. సదస్సుల పేరుతో వ్యాపారులను పంపించేసి..తరువాత ఆయా స్థలాలను ఇతరులకు అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పటికే బీచ్‌రోడ్డు, ఇతర ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయించి రూ.లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ ఇటీవల నగరంలో ఏర్పాటైన దుకాణాలపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కార్పొరేటర్లు బొండా జగన్నాథం, గొలగాని మంగవేణి, భీమిలి ఇన్‌ఛార్జి రాజాబాబు, నేతలు పాశర్ల ప్రసాద్‌, లొడగల కృష్ణ, వలిశెట్టి తాతాజీ, ఈతలపాక సుజాత, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని