logo

వర్షాలతో ఉపశమనం

మార్చి ప్రారంభంలో ఎండలు మండిపోవడంతో ఇబ్బంది పడిన ప్రజలకు తాజా వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. జిల్లావ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

Published : 20 Mar 2023 03:07 IST

మ్యాన్‌హోల్‌ నుంచి ఉబికి వస్తున్న వర్షంనీరు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: మార్చి ప్రారంభంలో ఎండలు మండిపోవడంతో ఇబ్బంది పడిన ప్రజలకు తాజా వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. జిల్లావ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమై, చలిగాలులు వీచాయి. అత్యధికంగా విశాఖ నగరంలో 3.4 సెం.మీ., భీమునిపట్నంలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు, రహదారులపైకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో అయిదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. కనిష్ఠంగా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో 19.7, భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో 22.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

టౌన్‌కొత్తరోడ్డులో నిలిచిపోయిన నీరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని