logo

‘సంక్షామ’ వసతి గృహం

నర్సీపట్నం ఎస్సీ కాలనీలోని రెండో నంబరు సాంఘిక సంక్షేమ వసతిగృహం పైకప్పు పెచ్చులూడుతోంది. ఈ గదుల్లో నిద్రించే విద్యార్థులు ఎప్పుడే సిమెంట్‌ పెచ్చులు మీద పడతాయోనని భయాందోళన చెెందుతున్నారు.

Updated : 20 Mar 2023 05:02 IST

విద్యార్థులు నిద్రించే గదిలో పెచ్చులూడుతున్న స్లాబ్‌

ర్సీపట్నం ఎస్సీ కాలనీలోని రెండో నంబరు సాంఘిక సంక్షేమ వసతిగృహం పైకప్పు పెచ్చులూడుతోంది. ఈ గదుల్లో నిద్రించే విద్యార్థులు ఎప్పుడే సిమెంట్‌ పెచ్చులు మీద పడతాయోనని భయాందోళన చెెందుతున్నారు. 110 మంది వసతిగృహంలో ఉంటున్నారు. విద్యార్థులను రాత్రివేళ ఆవరణలో చదివిస్తున్నప్పుడు వరండాలో స్లాబ్‌ నుంచి ఓ పెచ్చు ఊడి సంక్షేమాధికారిపై పడింది. పెచ్చులూడి పడే ఆస్కారమున్న ప్రదేశాలను ఎప్పటికప్పుడు గుర్తించి తొలగిస్తున్నప్పటికీ ఏదో ఒకచోట పడుతూనే ఉన్నాయి. స్లాబ్‌ పూర్తిగా తొలగించి కొత్తగా వేయాలని ఇంజినీరింగ్‌ అధికారులు తేల్చినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు భయం భయంగానే వసతిగృహంలో ఉండాల్సి వస్తోంది. ఓ గదిలో టైల్స్‌ దెబ్బతిన్నాయి. విద్యార్థుల కోసం నాలుగు గదులు వినియోగిస్తున్నారు. ఒక గది సంక్షేమాధికారికి, ఒకటి సరకులు నిల్వ చేసే గదిగా వాడుతున్నారు. గత నెల 17న ఆర్డీఓ జయరామ్‌, ఇతర అధికారులు బృందంగా ఈ వసతిగృహాన్ని పరిశీలించారు. ప్రమాదాలు జరగకముందే మరమ్మతు చేయించడానికి అధికారులు చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, నర్సీపట్నం అర్బన్‌

గదిలో దెబ్బతిన్న గచ్చు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని