logo

దసరా వచ్చేస్తోంది..!

సినీహీరో నాని ఆదివారం విశాఖ నగరంలో సందడి చేశారు. త్వరలో విడుదల కాబోతున్న ‘దసరా’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలు వివరించారు.

Published : 20 Mar 2023 03:34 IST

ఈనాడు, విశాఖపట్నం

సినీహీరో నాని ఆదివారం విశాఖ నగరంలో సందడి చేశారు. త్వరలో విడుదల కాబోతున్న ‘దసరా’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలు వివరించారు.


‘దసరా టీజర్‌కు మంచి స్పందన’

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: దసరా చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని హీరో నాని అన్నారు. సినిమా ప్రచారంలో భాగంగా విశాఖ వచ్చిన ఆయన ఆదివారం బీచ్‌రోడ్డులోని ఓ హోటల్లో  సమావేశం నిర్వహించారు. దసరా సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమన్నారు. కీర్తిసురేష్‌తో  తాను చేస్తున్న రెండో సినిమా అన్నారు. నేను లోకల్‌ సినిమాలోనూ కలిసి నటించామన్నారు. ఈనెల 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుందన్నారు. పుష్ప, కేజీఎఫ్‌-2 సినిమాల మాదిరిగా దసరా సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. పాటలు కూడా బాగావచ్చాయన్నారు. శ్రీకాంత్‌ దర్శకత్వంలో సంతోష్‌నారయణ సంగీతం అందించారన్నారు. అంతకు ముందు క్రికెట్‌ స్టేడియంకు కూడా నాని వెళ్లారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని