logo

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తెదేపాకే పట్టం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతం కానున్నాయని తెదేపా నేతలు స్పష్టం చేశారు.

Updated : 20 Mar 2023 04:57 IST

వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోయారు
‘ఎమ్మెల్సీ విజయోత్సవ పాదయాత్ర’లో తెదేపా నేతలు

పాదయాత్రగా వస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతం కానున్నాయని తెదేపా నేతలు స్పష్టం చేశారు. వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోయారని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెదేపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి స్థానం నుంచి తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం ఉదయం విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. అనుమతుల కోసం శనివారం సాయంత్రం పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మూడో పట్టణ పోలీసులతో పాటు ఏసీపీ కార్యాలయాలకు వెళ్లారు. పోలీసు అధికారులు అందుబాటులో లేరు. దీంతో దరఖాస్తును ఈ-మెయిల్‌, వాట్సప్‌ ద్వారా పంపినట్లు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. తరువాత పార్టీ కార్యాలయం నుంచి జగదాంబకూడలి, పూర్ణమార్కెట్‌, కోటవీధి, దుర్గాలమ్మ ఆలయం కూడలి, పోలీసు బ్యారెక్సు మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేయాలని నిర్ణయించారు.

* ఎన్నికల కోడ్‌ ఈనెల 21 వరకు అమల్లో ఉన్నందున అనుమతి ఇవ్వబోమని ఆదివారం ఉదయం పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో నేతలు పార్టీ కార్యాలయం నుంచి బీచ్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం వరకు పాదయాత్రగా బయలుదేరారు. పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు వేపాడ చిరంజీవిరావు, బండారు సత్యనారాయణమూర్తి, కోండ్రు మురళీ మోహన్‌, నాగజగదీశ్వరరావు, దామెచర్ల సత్య, గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, కోళ్ల లలితకుమారి, పీలా గోవిందు సత్యనారాయణ, ద్వారపురెడ్డి జగదీష్‌, ప్రగడ నాగేశ్వరరావు, విజయకుమార్‌, చిక్కాల విజయబాబు, కిమిడి మల్లిక్‌నాయుడు, పాశర్ల ప్రసాద్‌, సర్వసిద్ధి అనంతలక్ష్మి, వలిశెట్టి తాతాజీ, పైల ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు