logo

IND Vs AUS: అంతా.. 4 గంటల్లోనే!

మేఘాలు కరుణించాయి.. వర్షం ఆగిపోయింది. ఇక మ్యాచ్‌ చూద్దామని ఉత్సాహంగా క్రికెట్‌ స్టేడియానికి వచ్చిన వేలాది మంది అభిమానులు చివరికి నిరాశకు గురయ్యారు. అచ్చొచ్చిన పిచ్‌పై భారత జట్టు చతికిలపడడంతో ఆవేదనకు గురయ్యారు.

Updated : 20 Mar 2023 08:51 IST

నిరాశ చెందిన క్రికెట్‌ అభిమానులు
న్యూస్‌టుడే, విశాఖ క్రీడలు

విరాట్‌ కోహ్లి, ఆస్ట్రేలియా ఆటగాళ్లు

మేఘాలు కరుణించాయి.. వర్షం ఆగిపోయింది. ఇక మ్యాచ్‌ చూద్దామని ఉత్సాహంగా క్రికెట్‌ స్టేడియానికి వచ్చిన వేలాది మంది అభిమానులు చివరికి నిరాశకు గురయ్యారు. అచ్చొచ్చిన పిచ్‌పై భారత జట్టు చతికిలపడడంతో ఆవేదనకు గురయ్యారు.

టమిని పక్కన పెడితే కనీసం ప్రత్యర్థి ఆసీస్‌కు గట్టి పోటీ ఇవ్వలేక పోవడాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆదివారం పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో డే అండ్‌ నైట్‌ వన్డే మ్యాచ్‌ను తిలకించిన అభిమానులు నిరాశకు గురయ్యారు.

* అభిమాన క్రికెటర్లు కొట్టే సిక్స్‌లు, ఫోర్లను కళ్లారా చూద్దామనుకుని ప్రేక్షకులు తరలివచ్చారు. 50 ఓవర్ల మ్యాచ్‌లో కనీసం నలభై ఓవర్ల వరకుకూడా ఆటగాళ్లు నిలబడక పోవడం దారుణమని పలువురు అభిమానులు బాహాటంగానే వ్యాఖ్యానించారు. లంచ్‌ విరామం మినహాయించి మొత్తం దాదాపు నాలుగు గంటలు కూడా మ్యాచ్‌ జరగలేదని వాపోయారు.


మ్యాచ్‌ హైలెట్స్‌..

* ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో అభిమానులు మ్యాచ్‌ జరుగుతుందో లేదో అనే సందేహంలో ఉండిపోయారు. ఉదయం 11.30 గంటలకు మేఘాలు తొలగి ఎండ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. 12 గంటలకు స్టేడియానికి రావడం ప్రారంభించారు.

* మ్యాచ్‌ ప్రారంభమైన గంటన్నర వరకు స్టేడియంలో కొన్ని గ్యాలరీలు ఖాళీగానే కనిపించాయి.టికెట్లు ఎక్కువ శాతం బ్లాక్‌ చేయడం, అభిమానులకు లభ్యం కాకపోవడం ఇందుకు కారణాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

* అక్షర్‌ పటేల్‌ 25వ ఓవర్‌లో వరుసగా కొట్టిన రెండు సిక్సర్లలతో అభిమానుల్లో కొంత ఉత్సాహం వచ్చింది. అయితే కాసేపటికే అది ఆవిరైంది.

* భారత్‌ ఓపెనర్లు విఫలమైన చోటే.. ఆస్ట్రేలియా ఓపెనర్లు చెలరేగి ఆడారు. ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటరు మిచెల్‌ మార్ష్‌ 7.5 ఓవర్‌లో కొట్టిన భారీ సిక్సర్‌ గ్యాలరీలో పడడం విశేషం.

స్టేడియం వద్ద రద్దీ


* మధ్యాహ్నం 3.15 గంటలకే స్టేడియంలోని ఫ్లడ్‌లైట్లన్నీ వెలిగాయి. ఒక్కో స్తంభానికి 98 దీపాలు ఉండగా స్టేడియం నలువైపులా ఉన్న నాలుగు స్తంభాలకు కలిపి మొత్తం 392 వెలుగుతూ విద్యుత్తు కాంతులు విరజిమ్మాయి.


స్టేడియం పరిసరాల్లో విస్తృత తనిఖీలు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : క్రికెట్‌ స్టేడియం పరిసరాల్లో భద్రతా చర్యల్లో భాగంగా కే9  డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేశాయి. స్టేడియం సమీపంలోని బహుళ అంతస్తులపైనుంచి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కదలికలను గమనించారు. నగర పరిధిలో అన్ని కూడళ్లలో గస్తీ ఉన్న పోలీసులు 192 వాహనాలను తనిఖీలు చేశారు.

బస్సుల్లో వస్తున్న క్రికెట్‌ క్రీడాకారులకు అభివాదం చేస్తున్న అభిమానులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని