logo

Sobhan Babu: గుండెల్లో అభిమానం.. ఇంటి ఆవరణలో శోభన్‌బాబు విగ్రహం

విశాఖపట్నం 56వ వార్డు ఆర్పీపేటలో నివాసం ఉంటున్న సాధారణ మధ్య తరగతికి చెందిన కాండ్రేగుల వెంకట్రావు రోజువారీ ప్రైవేటు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

Updated : 20 Mar 2023 11:20 IST

ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాల నిర్వహణ

ఇంటి ఆవరణలో శోభన్‌బాబు విగ్రహానికి పూలమాల వేస్తున్న వెంకట్రావు

కరాస, న్యూస్‌టుడే : విశాఖపట్నం 56వ వార్డు ఆర్పీపేటలో నివాసం ఉంటున్న సాధారణ మధ్య తరగతికి చెందిన కాండ్రేగుల వెంకట్రావు రోజువారీ ప్రైవేటు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నతనం నుంచి ఆయనకు సినీనటుడు శోభన్‌బాబు అంటే ఎనలేని అభిమానం. మొదటి నుంచీ శోభన్‌బాబు సినిమాలు చూస్తూ, విశాఖ సిటీ వైడ్‌ శోభన్‌బాబు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి, అధ్యక్షునిగా పని చేశారు. 1995వ సంవత్సరంలో శోభన్‌బాబు విశాఖలోని వెంకట్రావు ఇంటికి వచ్చి ఓ రాత్రి బస చేశారు. ఆ తర్వాత  వెంకట్రావు తరచూ శోభన్‌బాబు ఇంటికి, సినిమాల చిత్రీకరణ ప్రదేశాలకు వెళ్తుండేవారు. అలా వారిద్దరి మధ్య అభిమాన బంధం ఏర్పడింది. శోభన్‌బాబు మృతి చెందిన తర్వాత వెంకట్రావు తాను నివాసం ఉంటున్న ఇంటి ఆవరణలో సుమారు 20 గజాల స్థలాన్ని కేటాయించి... శోభన్‌బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటా జనవరి 14న జయంతి, మార్చి 20న వర్ధంతితో పాటు, శోభన్‌బాబు పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘‘మనిషి జీవించి ఉన్నప్పుడు కాకుండా, చనిపోయిన తర్వాత అభిమానం చూపాలన్న’’ శోభన్‌బాబు చివరి మాటల స్ఫూర్తితోనే విగ్రహం ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని వెంకట్రావు తెలిపారు.

వెంకట్రావు ఇంట్లో శోభన్‌బాబు (పాతచిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని