logo

నూకాలమ్మ జాతర ప్రారంభం

ఉత్తరాంధ్రలో పేరొందిన అనకాపల్లి నూకాలమ్మ జాతర సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ఖోఖో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దాడి జయవీర్‌, ఇన్‌ఛార్జి డీఎస్పీ మళ్ల మహేష్‌, సీఐ మోహనరావు, ఆలయ సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ప్రత్యేక పూజలు చేశారు.

Published : 21 Mar 2023 03:28 IST

అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రలో పేరొందిన అనకాపల్లి నూకాలమ్మ జాతర సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ఖోఖో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దాడి జయవీర్‌, ఇన్‌ఛార్జి డీఎస్పీ మళ్ల మహేష్‌, సీఐ మోహనరావు, ఆలయ సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణను పూలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. కోలాటం, చిడతల ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొత్తఅమావాస్య పూజల నిమిత్తం ఆలయాన్ని మంగళవారం సాయంత్రం 5 గంటలకు మూసివేయనున్నట్లు కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్‌ చెప్పారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు తిరిగి గుడిని తెరుస్తామన్నారు. ఉదయం 6 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని